
RJD కంచుకోటగా భావించే రఘోపూర్ నుంచి ఆ పార్టీ నేత తేజస్వి యాదవ్ ఓడిపోతారని జన్ సురాజ్ పార్టీ నేత ప్రశాంత్ కిషోర్ జోస్యం చెప్పారు. రాహుల్ గాంధీ 2019లో అమేథీ నుంచి ఓడిపోయినట్టే తేజస్వీ కూడా రఘోపూర్ నుంచి ఓడిపాతారని అన్నారు. వైశాలి జిల్లాలోని వీవీఐపీ నియోజకవర్గమైన రఘోపూర్ నుంచి ఎన్నికల ప్రచారానికి ప్రశాంత్ కిశోర్ శనివారంనాడు శ్రీకారం చుట్టారు. రఘోపూర్ నుంచి లాలూ ప్రసాద్ యాదవ్ రెండుసార్లు, రబ్రీదేవి మూడుసార్లు శాసససభ్యులుగా గతంలో ఎన్నికయ్యారు.