గ్లోబల్ సమ్మిట్ ఒప్పందాలపై మాజీ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొస్తున్న పెట్టుబడులు, తద్వారా యువతకు లభించే ఉద్యోగ అవకాశాలు కేసీఆర్కు ఇష్టం లేనట్లు కనిపిస్తోందని ఆయన విమర్శించారు. ఒక బాధ్యతాయుతమైన ప్రతిపక్ష నేతగా అభివృద్ధిని అడ్డుకోకుండా, రాష్ట్ర ప్రగతికి తోడ్పడేలా సలహాలు ఇవ్వాలని మంత్రి సూచించారు. కేవలం రాజకీయ ఉనికి కోసమే ప్రభుత్వంపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.

