
ప్రధాని నరేంద్రమోడీ శనివారం రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో భేటీ అయ్యారు. జపాన్, చైనా దేశాల పర్యటన ముగించుకుని విచ్చేసిన ప్రధాని మోడీ తన పర్యటన విశేషాలను రాష్ట్రపతితో ప్రస్తావించారు. షాంఘై సహకార సంస్థ 25 వ వార్షిక సమావేశాలకు ప్రధాని మోడీ హాజరయ్యారు. ఈ శిఖరాగ్ర సమావేశంలో షాంఘై సహకార సంస్థ అభివృద్ధి వ్యూహం, గ్లోబల్ గవర్నెన్స్‌లో సంస్కరణలు, ఉగ్రవాద నిరోధక చర్యలు,
శాంతి, భద్రత , ఆర్థిక రంగాల్లో సహకారం, సుస్థిర అభివృద్ధిపై ఫలప్రదమైన చర్చలు జరిగాయి.