తెలంగాణ ప్రభుత్వం రేషన్ కార్డుల విషయంలో ప్రజా పంపిణీ వ్యవస్థను మరింత పారదర్శకంగా మార్చాలనే లక్ష్యంతో, అనర్హులుగా ఉన్నవారిని గుర్తించి వారి కార్డులను తొలగించే ప్రక్రియను వేగవంతం చేసింది. క్షేత్రస్థాయిలో జరిగిన ప్రాథమిక విచారణలో ఇప్పటికే లక్షమందికి పైగా అనర్హులు రేషన్ సౌకర్యాన్ని పొందుతున్నట్లు అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ నగరంలో దాదాపు 2 లక్షల మంది Income Tax చెల్లింపుదారులు రేషన్ కార్డులు కలిగి ఉన్నట్లు టిజి విజిలెన్స్ విభాగం నిర్వహించిన రహస్య ఆడిట్లో వెల్లడైందట.

