రామోజీ ఎక్స్లెన్స్ అవార్డ్స్ కార్యక్రమం రామోజీ ఫిలిం సిటీలో ఇవాళ(ఆదివారం) సాయంత్రం అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి హాజరయ్యారు. అలాగే ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, పాల్గొన్నారు. జర్నలిజం, గ్రామీణాభివృద్ధి, సైన్స్ అండ్ టెక్నాలజీ సహా ఏడు రంగాల్లో విశిష్ట సేవలందించిన ప్రముఖులకు రామోజీ ఎక్స్లెన్స్ అవార్డులను ప్రధానం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా రామోజీ నిఘంటువులనూ విడుదల చేశారు.

