ఇరాన్‌లో తీవ్రమవుతున్న యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో, టెహ్రాన్‌లోని భారత రాయబార కార్యాలయం ఇరాన్‌లో ఉన్న భారత పౌరులకు కీలక ప్రకటన జారీ చేసింది. రాబోయే 48 గంటల పాటు భారతీయులు ఉన్న చోటనే ఉండాలని కీలక సూచన జారీ చేసింది. ప్రజలు ఇళ్లలోనే ఉండాలని, అన్ని విద్యుత్, సైనిక స్థావరాలకు, బహుళ అంతస్తుల భవనాలకు దూరంగా ఉండాలని ఆ సలహాలో పేర్కొన్నారు. హోర్ముజ్ జలసంధిని తెరవకపోతే ఇరాన్‌పై పెద్ద దాడి చేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించిన తరుణంలో ఈ ప్రకటన వెలువడింది.

