
హైదరాబాద్లోని బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (BITS) క్యాంపస్. అక్కడి విద్యార్థులైన జయంత్ ఖత్రీ, సౌర్య చౌధురి హాస్టల్ గదిలో వచ్చిన ఆలోచనకు ఆవిష్కార రూపం ఇచ్చారు. ఆ ఇద్దరూ స్థాపించిన డిఫెన్స్ టెక్ స్టార్టప్ ‘అపోలియన్ డైనమిక్స్’ ఇప్పుడు రాడార్ల కన్నుగప్పి శరవేగంతో దూసుకెళ్లే కమికేజ్ డ్రోన్లను రూపొందించి భారత సైన్యానికి అందిస్తోంది. ఆ డ్రోన్లు ఇప్పటికే ఇండియన్ ఆర్మీలోని జమ్మూ, చండీమందిర్ (హర్యానా), పనగఢ్ (పశ్చిమ బెంగాల్), అరుణాచల్ ప్రదేశ్లోని సైనిక యూనిట్లకు చేరుకున్నాయి.