ఐపీఎల్ మూడవ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టు చెన్నై సూపర్ కింగ్స్‌ను 127 పరుగులకే ఆలౌట్ చేసింది. గౌహతిలోని బర్సపారా స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో ఆర్ఆర్ కెప్టెన్ రియాన్ పరాగ్ బౌలింగ్ ఎంచుకున్నాడు. చెన్నై తరఫున జేమీ ఓవర్టన్ 43 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. కేవలం సంజు మాత్రమే కాదు, రాజస్థాన్ బౌలర్ల ధాటికి చెన్నై టాప్ ఆర్డర్ మొత్తం కుదేలైంది. ఓవర్టన్ 36 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్ లతో 43 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు.

