
నైరుతి బంగాళాఖాతంలో సుస్పష్ట అల్పపీడనం కొనసాగుతోంది. 12 గంటల్లో క్రమంగా బలహీనపడి అల్పపీడనంగా మారే అవకాశముంది. అండమాన్ సముద్ర తీరంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. 24 గంటల్లో రాష్ట్రంలో అతిభారీ వర్షాలు కురిసే అవకాశముంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కర్నూలు జిల్లాలతో పాటు యానాంలో ఆకస్మిక వరదలు వచ్చే అవకాశముందని పేర్కొంది. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.