
టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న చాలా ఏళ్లుగా ప్రేమలో ఉన్నారనే విషయం తెలిసిందే. శుక్రవారం కుటుంబ సభ్యుల సమక్షంలో రష్మిక, విజయ్ దేవరకొండ రహస్యంగా నిశ్చితార్థం చేసుకున్నారని, అభిమానులు సోషల్ మీడియాలో విజయ్, రష్మికలకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. దీనికి సంబంధించిన పోస్టులు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. విజయ్ దేవరకొండ పీఆర్ బృందం కూడా ఈ విషయాన్ని ధృవీకరించింది.
వచ్చే ఏడాది ఫిబ్రవరిలో వీరిద్దరూ వివాహం చేసుకోనున్నారని సమాచారం.