ఆధ్యాత్మిక వైభవానికి ప్రతీకగా నిలిచే ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి ఆలయం బ్రహ్మోత్సవాల సందర్బంగా రజత కాంతుల్లో తళుక్కుమంటూ భక్తులను మంత్రముగ్ధులను చేస్తోంది. పవిత్రమైన ఈ క్షేత్రం టిటిడి ఆధ్వర్యంలో చేపట్టిన అద్భుత విద్యుత్ అలంకరణలతో దివ్యమైన ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టిస్తోంది. ఏప్రిల్ 1న జరగనున్న శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవం ఈ వేడుకల్లో ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. వేలాది మంది భక్తులు పాల్గొనే ఈ దివ్య ఘట్టాన్ని అందరూ వీక్షించేందుకు 24 ఎల్ఈడీ వీడియో డిస్ప్లే బోర్డులు ఏర్పాటు చేస్తున్నారు.

