ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్, ఉండి నియోజకవర్గం ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజుపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో ఆయన తృటిలో తప్పించుకున్నారు. కానీ.. ఆయన అనుచరులు, పలువురు టీడీపీ కార్యకర్తలు, నాయకులు గాయపడ్డారు. వాహనాలపై రాళ్లు పడడంతో అద్దాలు స్వల్పంగా దెబ్బతిన్నాయి. దీంతో హుటాహుటిన గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలించారు. కొంత మంది క్రిస్టియన్ సంఘాలకు చెందిన వారు.. నిరసన వ్యక్తం చేశారు. తమ వర్గాన్ని కించపరుస్తున్నారని.. దూషి స్తున్నారని ఆరోపిస్తూ.. క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

