పశ్చిమగోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం పరిధిలో ఉన్న ఆకివీడు సమీపంలో రామాలయం పునర్ నిర్మాణం విషయంలో ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు ప్రదర్శిస్తున్న పట్టుదలకు హైకోర్టులో షాక్ తప్పలేదు. రామాలయం పునర్ నిర్మాణం కోసం గొంతెనమ్మ గుడిని అర్ధరాత్రి కూల్చేసిన వ్యవహారంలో స్థానికులు దాఖలు చేసిన పిటిషన్ పై అత్యవసర విచారణకు హైకోర్టు అంగీకరించింది. ప్రభుత్వ స్థలాలలో ఎటువంటి మతపరమైన నిర్మాణాలు చేపట్టకూడదు అని సుప్రీంకోర్టు నిబంధనలు ఉన్న నూతనంగా గుడి నిర్మించడానికి ప్రయత్నిస్తున్నారన్న పిటిషన్ దాఖలు చేసారు.

