ఈస్టర్ వారోత్సవాల ప్రారంభం సందర్భంగా జరిగిన ‘పామ్ సండే’ వేడుకల్లో పోప్ లియో యుద్ధంపై తన గళాన్ని గట్టిగా వినిపించారు. “యుద్ధాలు చేసే పాలకుల చేతులు రక్తంతో నిండి ఉన్నాయి.. వారు ఎన్ని ప్రార్థనలు చేసినా దేవుడు వినడు” అని ఆయన బాహాటంగా ప్రకటించారు. శాంతికి మారుపేరైన ఏసుక్రీస్తును యుద్ధాలను సమర్థించుకోవడానికి వాడుకోవడం సరికాదని హితవు పలికారు. అమెరికాకు చెందిన మొదటి పోప్ అయిన లియో, ఏ నాయకుడి పేరునూ నేరుగా ప్రస్తావించనప్పటికీ, ఆయన వ్యాఖ్యలు మధ్యప్రాచ్యంలో యుద్ధం చేస్తున్న దేశాధినేతలను ఉద్దేశించినవేనని స్పష్టమవుతోంది.

