
యేసుదాస్‌కు ప్రతిష్టాత్మక ఎంఎస్ సుబ్బులక్ష్మి అవార్డు – సాయిపల్లవి, అనిరుథ్ రవిచందర్‌లకు కలైమామణి పురస్కారాలు తమిళనాడు ప్రభుత్వం సినీ రంగంలో ప్రతిష్టాత్మక అవార్డులను ప్రకటించింది. కళ, సంస్కృతికి కృషి
చేసిన కళాకారులకు ఎంఎస్ సుబ్బులక్ష్మి, భారతీయార్, కలైమామణి అవార్డులను ప్రకటించింది. 2021, 2022, 2023 సంవత్సరాలకు ఫేమస్ సింగర్ కేజే యేసుదాస్, హీరోయిన్ సాయి పల్లవి, ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ అవార్డులు అందుకున్నారు.