మాదాపూర్ గ్రామానికి చెందిన యూట్యూబర్ వైష్ణవికి,హరిబాబుతో యూట్యూబ్ పరిచయం ప్రేమగా మారి, పెళ్లికి దారితీసింది. అత్తగారి ఇంట్లోనే ఉంటూ రెండేళ్లుగా సంసారం సాగిస్తున్నాడు.ఇంట్లో ఆస్తి తగాదాలు నేపథ్యంలో భార్యాభర్తల మధ్య సోమవారం రాత్రి వీరిద్దరి మధ్య జరిగిన చిన్నపాటి వాగ్వాదం కాస్తా పెను గొడవకు దారితీసింది.ఇంట్లోని కత్తిని తీసుకుని వైష్ణవిని విచక్షణారహితంగా పొడిచాడు. తీవ్ర గాయాలైన ఆమె గర్భంలో ఉన్న బిడ్డతో సహా అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. హత్య చేసిన అనంతరం నిందితుడు హరిబాబు నేరుగా కోరుట్ల పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయాడు.

