యూట్యూబ్‌ని స్మార్ట్ టివిలో చూసే యూజర్లకు యూట్యూబ్ పెద్ద షాక్ ఇచ్చింది. ఇకపై స్మార్ట్టివిలో సుదీర్ఘ అన్‌స్కిప్పబుల్ యాడ్స్‌ని తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. ఏకంగా 90 సెకన్ల వరకు స్కిప్ చేయలేని యాడ్స్‌ను ప్రయోగాత్మకంగా పరీక్షిస్తున్నట్లు తెలిసింది. ఇప్పటివరకు స్మార్ట్ టివిల్లో 30 సెకన్ల అన్‌స్కిప్పబుల్ యాడ్స్ మాత్రమే వస్తున్నాయి ముఖ్యంగా 20 నిమిషాల నుంచి 40 నిమిషాల నిడివి కలిగిన వీడియోలకు ఈ తరహా యాడ్స్‌ను పుష్ చేయనున్నట్లు తెలుస్తోంది.

