యూఏఈ జైల్లో ఉన్న తన సోదరుడిని విడిపించమంటూ బాలీవుడ్ నటి సెలెనా జైట్లీ భారత ప్రభుత్వాన్ని వేడుకుంటోంది. సెలెనా అన్న విక్రాంత్ ఆర్మీలో మేజర్‌గా పని చేసి రిటైర్డ్ అయ్యాడు. ఓ కేసులో ఆయనను యూఏఈ అదుపులోకి తీసుకుంది. 2024 నుంచి యూఏఈలోని జైల్లోనే ఉన్నారు. కానీ, ఆయన్ను ఎక్కడ ఉంచారన్నది తెలియరాలేదు. సెలెనాకు సాయం చేయాలని విదేశీ వ్యవహారాల శాఖను కోర్టు ఆదేశించింది. అన్ని రకాలుగా విదేశీ వ్యవహారాల శాఖ సాయం చేసినా కూడా లాభం లేకుండా పోయింది.

