తెలంగాణ రాష్ట్రంలో క్రీడలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. యువత నెమ్మదిగా క్రీడలకు దూరం అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. క్రీడా మైదానాలను వదిలిపెట్టి యువత తప్పు చేస్తున్నారన్నారు.
పబ్, డ్రగ్ కల్చర్ లోకి వెళ్తున్న యువతను తిరిగి క్రీడా మైదానాల్లోకి రప్పించడానికి ప్రయత్నం చేస్తున్నాను. బాగా చదువుకునే యువతనే డ్రగ్స్ బారిన పడుతున్నారు. పంజాబ్ యువత డ్రగ్స్ బారి పడ్డారు. మరో పంజాబ్ గా ఈ ప్రాంతాన్ని కానివ్వం. నేరాల తీరు ఇప్పుడు మారిపోయింది.’ అంటూ సీఎం పేర్కొన్నారు.

