ఉత్తరప్రదేశ్ లోని మథుర జిల్లాలోని బృందావన్ వద్ద యుమునా నదిలో ఘోర విషాదం చోటు చేసుకుంది. పంజాబ్ లోని ముక్తర్ కు చెందిన భక్తుల బృందం పడవలో ప్రయాణిస్తుండగా ఒక్కసారిగా బోల్తా పడింది. దీంతో అందులో ఉన్న వారంతా నదిలో మునిగిపోయారు. ఈ ఘటనలో సుమారు 25 మంది గల్లంతైనట్లు తెలుస్తోంది. దీంతో అప్రమమత్తమైన పోలీసులు, స్థానిక గజ ఈతగాల్లు సంఘటన స్థలానికి చేరకుని సహాయక చర్యలను ముమ్మరం చేశారు. అయితే ఇప్పటికే ఆరు మృతదేహాలు వెలిగితీసినట్లు సమాచారం అందుతోంది.

