చెన్నై సూపర్ కింగ్స్ ఆడే మ్యాచ్ లు మాత్రం దళపతి విజయ్‌కి మాత్రం బాగా కలిసి వస్తున్నాయి. ఆయన పార్టీకి ఖర్చు లేని పబ్లిసిటీ ఈ మ్యాచ్‌ల ద్వారా లభిస్తోంది. ఆదే “విజిల్ మోత “..! పొలిటికల్ పార్టీ “తమిళ్ వెట్రి కళగం “(TVK)కు ఎన్నికల గుర్తుగా విజిల్ (ఈల)ను కేటాయించింది ఎలక్షన్ కమిషన్. దానితో ఆయన అభిమానులు కార్యకర్తలు ఎక్కడికి వెళ్లినా విజిల్ సౌండ్ చేస్తూ హంగామా చేస్తున్నారు. దానికి తోడు ఐపీఎల్ రావడంతో చెన్నై మ్యాచ్‌లు జరిగే చోట విజిల్స్ ప్రచారం కల్పిస్తున్నారు.

