
ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఢిల్లీలో జరిగిన ‘న్యాయ్ సమ్మేళన్’ కార్యక్రమంలో పాల్గొన్న రాహుల్, మోదీపై నిశితంగా వ్యాఖ్యలు చేశారు. “నిజం చెప్పాలంటే మోదీకి ధైర్యం లేదు. ఆయనపై క్రియేట్ అయ్యే హైప్ అంతా మీడియా ద్వారా. అంతా ఒక షో మాత్రమే,” అని అన్నారు. “అయనను దగ్గర నుంచి చూస్తే అర్థమవుతుంది. మోదీ నిజమైన నాయకత్వ లక్షణాలు కలవాడు కాడు. ప్రజల్లో భయం కలిగించేలా ఆయనను మీడియా చూపిస్తుంది.