
మోదీకి ట్రంప్ అంటే భయం అనికాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రధానిపై విమర్శలు ఎక్కుపెట్టారు. ‘ప్రధాని మోదీకి ట్రంప్ అంటే భయం. రష్యా చమురు కొనుగోళ్లపై ట్రంప్ ప్రకటన చేసేందుకు ప్రధాని అనుమతించారు. ట్రంప్ ఏం చేసినా పట్టించుకోకుండా శుభాకాంక్షల మెసేజీలు పంపుతూనే ఉన్నారు. ఆర్థికమంత్రి అమెరికా పర్యటనను రద్దు చేశారు. ఈజిప్టులో గాజా శాంతి ఒప్పందం కార్యక్రమానికి ప్రధాని వెళ్లలేదు. ఆపరేషన్ సిందూర్‌పై ట్రంప్ ప్రకటనలను ఖండించట్లేదు’ అంటూ పోస్టు పెట్టారు