మొరిగే కుక్కలు ఎప్పుడూ కరవవు, బురఖా వేసుకున్న మహిళ ఈ దేశానికి ప్రధాని అయితే, భారత్ ఒక ‘ఇస్లామిక్ స్టేట్’గా మారిపోతుంది” అంటూ బీజేపీ సీనియర్ నేత నితేశ్ రాణే ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీపై నిప్పులు చెరిగారు. మీ పార్టీ జాతీయ అధ్యక్షురాలిగా ఒక హిజాబ్ లేదా బురఖా ధరించిన మహిళను నియమించండి. పోనీ ఒక ‘పస్మాండా’ ముస్లింనైనా ఆ పదవిలో కూర్చోబెట్టండి. మీరేమో మహిళలను అధ్యక్షురాలిని చేయరు, కానీ దేశానికి మాత్రం మహిళా ప్రధాని కావాలా? అని ఎక్స్ వేదికగా సవాల్ విసిరారు.

