దేశంలోని ఇతర ప్రాంతాలలో మైనారిటీలపై దాడి చేసే వ్యక్తులతో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు సంబంధాలున్నాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. తన ఎన్నికల ప్రచారంలో శబరిమల అంశం గురించి ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడలేదని విమర్శించారు. బీజేపీ-ఎల్డీఎఫ్ మధ్య పొత్తు ఉందని అన్నారు. కేరళ అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఎల్డీఎఫ్లో ఎవరూ ఉండరని పేర్కొన్నారు. సీపీఎం పార్టీ తన ప్రధాన సిద్ధాంతంపై రాజీ పడుతోందని విమర్శించారు.

