సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని 7వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు నగదును పంపిణీ చేశారు. అయితే ఈ దృశ్యాలను పాత్రికేయులు వీడియోలు తీశారు. దీంతో ఈ వీడియో తీసిన పాత్రికేయులపై కాంగ్రెస్ అభ్యర్థి అనుచరులు మూకుమ్మడి దాడికి దిగారు. అతడి సెల్ఫోన్లు లాక్కొని వీడియోలు తొలగించారు. కాంగ్రెస్ అభ్యర్థి అనుచరుల దాడిని జర్నలిస్టు సంఘాలు తీవ్రంగా ఖండించాయి.

