
‘ఏఎక్స్-4’ మిషన్ పైలట్‌గా భారత వ్యోమగామి శుభాన్షు శుక్లా మే 29న అంతరిక్షంలోకి వెళ్తున్నారు. భారత్, పోలండ్, హంగేరీ వ్యోమగాములతో కూడిన అంతర్జాతీయ బృందానికి నాసా వ్యోమగామి పెగ్గీ విట్సన్ నేతృత్వం వహిస్తున్నారు. వ్యోమగాములు ప్రయాణిస్తున్న స్పేస్ ఎక్స్ డ్రాగన్ రాకెట్‌ను మే 29 ఉదయం 10.33 గంటలకు ప్రయోగిస్తున్నట్టు సమాచారం. ఐఎస్ఎస్లో అడుగుపెడుతున్న తొలి భారతీయుడిగా శుక్లా రికార్డ్ సృష్టించనున్నారు. 1984లో భారత వ్యోమగామి రాకేశ్ శర్మ తర్వాత మళ్లీ ఇన్నేండ్లకు అంతరిక్షంలోకి అడుగుపెడుతున్న భారతీయుడు