జిల్లాలో సరిపడ పెట్రోల్, డీజిల్ నిల్వలు ఉన్నాయని ఆర్డీవో రమాదేవి తెలిపారు. మంగళవారం పట్టణంలోని శ్రీనివాస పెట్రోల్ పంపును తహసీల్దార్ లక్ష్మణ్ బాబుతో పరిశీలించారు. ప్రస్తుతం పంపులో పెట్రోల్ నిల్వ 29,232 లీటర్లు , డీజిల్ నిల్వ : 26,667 లీటర్లు నిల్వ ఉన్నాయని వెల్లడించారు. వినియోగదారులు ఆందోళన చెందవద్దని సూచించారు. రాజ్పల్లిలోని పీఏసీఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆమె పరిశీలించారు. గన్ని సంచుల వివరాలు, తాగునీటి సౌకర్యం గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.

