
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మెగా డీఎస్సీ విజయాన్ని “మెగా హిట్”గా అభివర్ణించారు. సీఎం చంద్రబాబు మాట్లాడుతూ, “సూపర్ సిక్స్ హామీల్లో మొదటిది మెగా డీఎస్సీ. నేను సీఎంగా చేసిన మొదటి సంతకం ఇదిపైనే. ఉపాధ్యాయ నియామకాలు జరిగి, వేలాది మంది యువతకు ఉపాధి లభించడం గర్వకారణం. ఈ నిర్ణయాన్ని విజయవంతంగా అమలు చేసిన లోకేశ్ టీంకు అభినందనలు” అని అన్నారు. నియామకాల ప్రక్రియలో ఎదురైన ప్రతిబంధకాలను అధిగమించడం ద్వారా ప్రభుత్వం విద్యారంగంపై తన కట్టుబాటును నిరూపించిందని ఆయన వ్యాఖ్యానించారు.