ప్రధాని నరేంద్రమోదీ మూడు దేశాల పర్యటన సోమవారం మొదలైంది. ఈ పర్యటనలో భాగంగా ఆయన ముందుగా జోర్డాన్ లోని అమ్మాన్ కు చేరుకున్నారు. అమ్మాన్ విమానాశ్రయంలో జోర్డాన్ ప్రధాని జాఫర్ హసన్ స్వయంగా ప్రధాని మోదీకి స్వాగతం పలికి ప్రత్యేక గౌరవం కల్పించారు. భారత్-జోర్డాన్ మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడి 75 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో ఈ పర్యటన చారిత్రక ప్రాధాన్యత సంతరించుకుంది. 37 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత భారత ప్రధాని జోర్డాన్‌లో
పూర్తిస్థాయి ద్వైపాక్షిక పర్యటన చేపట్టడం ఇదే తొలిసారి.

