పైరసీ సినిమాల కేసులో ఐ బొమ్మ రవి ఒక్కడే సినిమాలను పైరసీ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఐదేళ్ల నుంచి సినిమాలను ఐ బొమ్మ వెబ్‌సైట్ ద్వారా పైరసీ చేస్తున్న రవి బెట్టింగ్ యాప్‌లు, గేమింగ్, మ్యాట్రీమోని వెబ్‌సైట్లను ప్రమోట్ చేయడం ద్వారా రూ.100కోట్ల వరకు సంపాదించినట్లు పోలీసులు గుర్తించారు. రవి క్రిప్టో కరెన్సీలో నిర్వహించినట్లు గుర్తించారు. ఐ బొమ్మను ఒకసారి క్లిక్ చేస్తే 15 ప్రకటనలు వచ్చే విధంగా డిజైన్ చేశారు, ఇందులో మ్యాట్రిమోనీ, గేమింగ్, బెట్టింగ్ యాప్‌లు ఓపెన్ అయ్యే విధంగా చేశాడు

