నెల్లూరు మేయర్ పొట్లూరి స్రవంతి రాజకీయ భవిష్యత్ గందరగోళంలో పడింది. ముందు నుయ్యి వెనుక గొయ్యి మాదిరిగా పొట్లూరి స్రవంతి పరిస్థితి తయారైంది. టీడీపీ అవిశ్వాస తీర్మాణం పెడతామని చెప్తుంటే…వైసీపీ మాత్రం మేయర్ తమ పార్టీకి చెందిన వ్యక్తి కాదని చెప్తోంది. డిప్యూటీ మేయర్ రూప్ ఆరోపించినట్టు నా దగ్గర ఒక్క ఫైల్ కూడా పెండింగ్లో లేదు, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మమల్ని ఇబ్బంది పెడుతున్నారు. ఈ రౌడీ రాజకీయాలను అరికట్టేందుకు కూటమి ప్రభుత్వ నాయకులు జోక్యం చేసుకోవాలి’అని మేయర్ పొట్లూరి స్రవంతి కోరారు.

