దక్షిణాఫ్రికాలోని భారత సంతతికి చెందిన టెక్ వ్యాపారులతో, భారతీయ సంఘ ప్రతినిధులతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమావేశమయ్యారు. భారత్తో తమ అనుబంధాన్ని మరింతగా బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. జీ 20 నేతల సదస్సులో పాల్గొనడాని కిజొహన్నెస్బర్గ్ వెళ్లిన మోదీ, భారత సంతతికి చెందిన వారితో జరిగిన సమావేశాన్ని ఫలప్రదమైనదని వర్ణించారు. భారత్తో అనుబంధాన్ని మరింతగా పెంచి, తమ ప్రజలతో సన్నిహితంగా పనిచేయండని ప్రధాన మంత్రి వారికి సూచించారు.

