
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మలయాళ సూపర్ స్టార్ కు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. ‘మోహన్‌లాల్ బహుముఖ ప్రజ్ఞకు ప్రతీక.దశాబ్దాలుగా మలయాళ సినిమా ఇండస్ట్రీకి దివిటీలా నిలుస్తున్నారు. కేరళ సంస్కృతి పట్ల మక్కువ కలిగిన ఆయన కేవలం మలయాళమే కాకుండా, తెలుగు, తమిళ, కన్నడ, హిందీ చిత్రాల్లోనూ అద్భుతమైన పాత్రలు పోషించారు. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుకు ఎంపికైనందుకు ఆయనకు అభినందనలు . ఆయన సాధించిన విజయాలు రాబోయే తరాలకు స్ఫూర్తిదాయకంగా నిలవాలి’ అంటూ ట్వీట్ లో రాసుకొచ్చారు ప్రధాని మోడీ.