
మిస్ వరల్డ్ పోటీని ప్రపంచ వేదికగా ఉపయోగించుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ప్లాన్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర చారిత్రక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక వారసత్వాన్ని ప్రపంచానికి పరిచయం చేసేందుకు ఈ వేదికను ఉపయోగించుకునే ప్రణాళికలు రూపొందించింది. 120 దేశాల నుంచి ప్రతినిధులు పాల్గొననున్న ఈ ఈవెంట్‌ను 150 దేశాల్లో ప్రత్యక్ష ప్రసారం కానుంది. ఈ గ్లోబల్ ఈవెంట్ కేవలం అందాలను మాత్రమే కాకుండా, తెలంగాణ సంపదను, సంస్కృతిని, చారిత్రక ఘనతను ప్రపంచానికి పరిచయం చేసే వేదికగా మారబోతుంది.