
కేంద్ర హోంమంత్రి అమిత్ షా సంచలన ప్రకటన చేశారు. నక్సలిజానికి వ్యతిరేకంగా నిర్ణయాత్మక పోరాటాన్ని ప్రకటించారు. మార్చి 31, 2026 నాటికి దేశం నుండి నక్సలైట్లను పూర్తిగా నిర్మూలించడమే ప్రభుత్వ లక్ష్యమని, వర్షాకాలం సీజన్లోనూ నక్సల్స్‌ను విశ్రాంతి తీసుకోనీయమని, నక్సల్స్ ఏరివేత ఆపరేషన్ ఆ సీజన్లోనూ కొనసాగుతుందని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా హెచ్చరించారు. నక్సల్స్‌తో చర్చల ప్రసక్తే లేదని అమిత్ షా పునరుద్ఘాటించారు. ఆయుధాలు వదిలి జనజీవన స్రవంతిలో కలవాలని విజ్ఞప్తి చేశారు.