
నెల్లూరు జిల్లాలో ఖనిజ సంపదను వెలికితీసి, అక్రమంగా రవాణా చేశారన్న ఆరోపణల నేపథ్యంలో బెంగళూరులో కాకాణి గోవర్థన్ రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు సోమవారం ఉదయం నెల్లూరు తీసుకువచ్చారు. తెల్లవారుజామున వెంకటాచలం పీహెచ్సీకి తరలించి వైద్య పరీక్షలు చేయించారు. వెంకటగిరి కోర్టులో మాజీమంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డిని హాజరుపరిచారు. ఇరువాదనలు విన్న కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది.
- 0 Comments
- SPSR Nellore District