యూట్యూబ్ ఇంటర్వ్యూలో తాను చేసిన హత్యల గురించి వివరించడం.. ఆ మాజీ మావోయిస్టు ప్రాణాలకే ముప్పు తెచ్చింది. ఆ ఇంటర్వ్యూ చూసిన ఓ వ్యక్తి, తన తండ్రిని చంపిన మావోయిస్టుపై పగ పెంచుకున్నాడు. యూట్యూబ్ ఇంటర్వ్యూ పేరుతో అతన్ని పిలిపించి.. మభ్యపెట్టి, మద్యం తాగించి, బండరాయితో కొట్టి దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో కలకలం రేపింది. నిందితుడిని నిజామాబాద్ జిల్లా వాసిగా గుర్తించారు.

