మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావును పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. మంగళవారం ఉదయం హైదరాబాద్‌లోని ఆయన నివాసం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఇండస్ట్రియల్ పార్క్ బాధిత రైతులను కలిసేందుకు వెళ్లకుండా ఆయన్ను అడ్డుకున్నారు. ఇండస్ట్రియల్ పార్క్ కోసం తమ భూములను గుంజుకోవద్దని ఆందోళన చేస్తున్న రైతులకు సంఘీభావం తెలిపేందుకు మాజీ మంత్రి హరీశ్‌రావు ఇవాళ వికారాబాద్ జిల్లా పరిగి మండలంలోని కాళ్లాపూర్ పర్యటనకు వెళ్లాల్సి ఉంది.

