బాపట్ల జిల్లాలోని వేటపాలెం మండలం రామాపురం సముద్రతీరంలో పర్యాటక అభివృద్ధి పేరుతో జరుగుతున్న కార్యకలాపాల పట్ల స్థానిక మత్స్యకారులు ఆందోళనకు దిగారు. “దివే చీరాల ఎల్ఎల్పీ” పేరిట బోటింగ్ నిర్వహణకుస్థానిక ప్రజా ప్రతినిధులు, రెవెన్యూ అధికారుల సహకారంతో పనులు జరుగుతున్నాయని పనులు కోస్టల్ రెగ్యులేషన్ జోన్ (CRZ) నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్నాయని, ఈ ప్రాజెక్ట్ వల్ల వారి వేట మార్గాలు, పడవల నిల్వ ప్రదేశాలు దెబ్బతింటాయి. జీవనాధారం కోల్పోయే పరిస్థితి వస్తుందని మత్స్యకారులు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

