మోనాలిసా భోస్లే తన ప్రియుడు ఫర్మాన్ ఖాన్ను వివాహం ‘లవ్ జిహాద్’లో భాగమని సోషల్ మీడియాలో రూమర్లు వచ్చాయి. “మోనాలిసా, నేను మతం మారలేదు. నేను ముస్లింగానే ఉంటాను. మోనాలిసా హిందువుగానే ఉంటుంది. అన్ని విశ్వాసాలు ఒకే విషయాన్ని భోదిస్తాయని నేను నమ్ముతాను” అని లవ్ జిహాద్ గురించి ఫర్మాన్ ఖాన్ స్పష్టం చేశాడు. “నేను సోదరుడిగా భావించే బంధువును వివాహం చేసుకోమని నా కుటుంబం నాపై ఒత్తిడి చేసింది. అయితే నేను ఇష్టపడిన ఫర్మాన్ ఖాన్ను వివాహం చేసుకున్నాను” అని మోనాలిసా వెల్లడించింది.

