కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పు అంశంపై రాజకీయ వేడి కొనసాగుతోన్న వేళ రాష్ట్ర సీఎం సిద్ధరామయ్య కుమారుడు యతీంద్ర సంచలన వ్యాఖ్యలు చేశారు. తన తండ్రి రాజకీయ జీవితం చివరి దశలో ఉందని బాంబు పేల్చారు.
అంతేకాకుండా కర్ణాటకలో కాంగ్రెస్ నాయకత్వాన్ని నడిపించేందుకు సతీశ్ ఝర్కిహోళి అర్హుడంటూ సీఎం మార్పుపై సంకేతాలు ఇచ్చారు. బెళగావి జిల్లాలో బుధవారం జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న యతీంద్ర సిద్ధరామయ్య, ఈ వ్యాఖ్యలు చేశారు. దీంతో ఇది కాస్తా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

