మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ల పర్వం మంగళవారంతో ముగిసింది. అయితే 15 సీట్లలో పోటీ చేసే అభ్యర్థులపై పార్టీల్లో ఇంకా స్పష్టత కొరవడింది. అధికార బీజేపీ, శివసేన, ఎన్సీపీ (అజిత్ పవార్) వర్గంలో నాలుగు సీట్లకు ఇంకా అభ్యర్థులను ప్రకటించ లేదు. ఇక విపక్ష మహా వికాస్ అఘాడీలోని శివసేన (యూబీటీ), కాంగ్రెస్, ఎన్సీపీ (శరద్ పవార్) పార్టీలు 11 స్థానాల్లో అభ్యర్థుల ప్రకటనపై మల్లగుల్లాలు పడుతున్నాయి.