
బీహార్ లో మహాఘట్ బంధన్ సీఎం అభ్యర్థి గా ఆర్జేడీ అగ్ర నాయకుడు తేజస్వి యాదవ్‌ను ఎన్నుకున్నారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, అగ్ర నాయకుడు రాహుల్‌గాంధీలను సంప్రతించిన అనంతరం తేజస్వియాదవ్‌ను ప్రతిపక్ష కూటమి తరఫు సీఎం అభ్యర్థిగా ఎన్నుకోవాలని నిర్ణయించామని గెహ్లాట్ పట్నాలో నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో చెప్పారు. వికాస్ శీల్ ఇన్సాన్ పార్టీ అధ్యక్షుడు ముఖేశ్ సహానీని డిప్యూటీ సీఎం అభ్యర్థిగా ఎన్నుకున్నట్లు తెలిపారు.