మహాదేవ్ ఆన్లైన్ బెట్టింగ్ యాప్ కేసుపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దూకుడుగా వ్యవహరిస్తున్నది. దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫాలో పలు ఫ్లాట్లతో సహా 20 స్థిరాస్తులను జప్తు చేసింది. ఈడీ కొత్తగా అటాచ్ చేసిన ఆస్తులలో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనమైన దుబాయ్‌లోని ప్రతిష్టాత్మక బుర్జ్ ఖలీఫాలోని పలు ఫ్లాట్లు, బిజినెస్ బే వాణిజ్య జిల్లా, ఎస్ఎల్ఎస్ హోటల్ ఉన్నాయి. మహాదేవ్ బెట్టింగ్ యాప్ ప్రధాన ప్రమోటర్లలో ఒకరైన సౌరభ్ చంద్రకర్‌తో సంబంధం ఉన్న వ్యక్తులు, సంస్థలకు చెందిన ఆస్తులని వెల్లడించారు.

