
ఉజ్జయిని మహంకాళీ బోనాలకు హైదరాబాద్ పోలీసులు భారీగా బందోబస్తును ఏర్పాటు చేశారు. బోనాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీసులు 2,500మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బోనాల సందర్భంగా 13వ తేదీ నుంచి 15వ తేదీ వరకు సికింద్రాబాద్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఉండేందుకు ట్రాఫిక్ డైవర్ట్ చేశారు. విఐపిలు మహంకాళీ ఆలయాన్ని సందర్శించనున్న నేపథ్యంలో పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.