రాజస్థాన్‌లోని బార్మర్ కలెక్టర్, ఐఏఎస్ అధికారిణి టీనా దాబి మళ్లీ వార్తల్లోకి ఎక్కారు. ఫీజుల పెంపునకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులు ఆమెను రీల్ స్టార్ అని విమర్శించడం.. ఇది కేవలం సోషల్ మీడియాలో పాపులారిటీ కోసం సృష్టించిన వివాదమేనని ఆమె కొట్టిపారేయడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. రాజస్థాన్ యూనివర్సిటీలో పరీక్షా ఫీజుల పెంపును నిరసిస్తూ బార్మర్‌లోని ఎంబీసీ గర్ల్స్ కాలేజీ విద్యార్థులు తీవ్ర ఆందోళన సందర్భంగా జిల్లా కలెక్టర్ టీనా దాబి తమను కలవడానికి నిరాకరించారని.. తమను అరెస్ట్ కూడా చేయించారని విద్యార్థులు ఆరోపించారు.

