
ఇటీవలి ఢిల్లీలో జరిగిన పత్రికా సమావేశంలో మహిళా జర్నలిస్టులకు చోటు దక్కకపోవడంతో అఫ్ఘాన్ మంత్రి ముత్తకీపై విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాలిబాన్లు దిద్దుబాటు చర్యలకు దిగారు. ఆదివారం ఏర్పాటు చేసిన పత్రికా సమావేశానికి స్త్రీపురుష బేధం లేకుండా జర్నలిస్టులను అందరినీ ఆహ్వానించారు అన్ని వైపుల నుంచి విమర్శల జడి ఎక్కువవడంతో మీడియా వారందరికీ తాజాగా ఆహ్వానం పలికారు. ఈ సమావేశంలో అందరికీ చోటు ఉందని అన్నారు.