కరీంనగర్ లో ప్రసిద్ది చెందిన సంప్రదాయ పూల ఆకృతితో ఉన్న సిల్వర్ మిర్రర్‌ను ఇటలీ ప్రధానికి బహుకరించానని ప్రధాని మోదీ చెప్పడంతో ఇప్పుడు ఫిలిగ్రీపై చర్చ నడుస్తుంది. కరీంనగర్ వాసులు అంతర్జాతీయ సమాజం ముందు తమలోని కళాత్మకతను ప్రదర్శించిన విషయాన్నీ గుర్తు చేసుకుంటున్నారు. మన్ కీ బాత్ లో పీఎం ఫిలిగ్రీ కళ గురించి ప్రస్తావించారు. కరీంనగర్‌లో తయారు చేసిన సిల్వర్ ఫిలిగ్రీ బహుమతులు.. వివిధ దేశాధినేతలకు అందించానని అన్నారు. ఈ బహుమతిలు తీసుకున్న నేతల సంతోషాన్ని వ్యక్తం చేశారని పీఎం గుర్తు చేశారు.

