కర్నూలు బస్సు ప్రమాద ఘటనకు సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రమాదానికి ముందు పెట్రోల్ బంక్‌లోకి బైకర్ వెళ్లిన దృశ్యాలు ప్రస్తుతం వైరల్ అయ్యాయి. ఇది కర్నూలులో బైకర్ శివశంకర్ చివరి వీడియో కాగా.. ప్రమాదానికి ముందు అతడు ఒక పెట్రోల్‌బంక్‌లో ఆగినట్టు వీడియోలో మీరు చూడవచ్చు. ఈ వీడియోలో అతడితో పాటు మరో యువకుడు కూడా ఉన్నాడు. తెల్లవారుజామున 2.23 గంటలకు CC ఫుటేజీలో ఈ దృశ్యాలు రికార్డు అయ్యాయి. ఆ సమయంలో శివశంకర్ మద్యం మత్తులో ఉన్నట్టు తెలుస్తోంది.

